ఆర్‌బీకేల్లో అందుబాటులో లేని ఎరువులు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌బీకేల్లో అందుబాటులో లేని ఎరువులు

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

ఆర్‌బీకేల్లో అందుబాటులో లేని ఎరువులు 30 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాం ●

మాకు 10 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం నీటి సదుపాయం కింద పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నాం. గ్రామ స్థాయిలో ఆర్‌బీకే ఉన్నా యూరియా, డీఏపీ అందుబాటులో లేవు. పేరుసోమల, తిమ్మనాయునిపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా వ్యయప్రయాసలకు లోనవుతున్నాం. ఆర్‌బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచితే ఎంఆర్‌పీకే లభిస్తాయి.

– వెంకటేశ్వరరెడ్డి, పెద్ద వెంతుర్ల,

కొలిమిగుండ్ల మండలం

మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా, మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాం. నేడు బస్తా ఎరువు కావాలన్నా, నీళ్ల మందులు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని డోన్‌కు లేదా 28 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండకు పోతున్నాం. ప్రతి అవసరానికి డోన్‌ లేదా పత్తికొండకు పోవాల్సి వస్తుండటంతో ఎక్కువ డబ్బులు ఖర్చవుతున్నాయి. రాజకీయాలు మానుకొని ఆర్‌బీకేలను రైతులకు అందుబాటులో ఉంచాలి.

– గన మద్దిలేటి, మారెళ్ల, తుగ్గలి మండలం

Advertisement
 
Advertisement
Advertisement