శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గుండెపోటుతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి
కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుదర్శన్ రాజు (57) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. నంద్యాల జిల్లా అయ్యలూరుమిట్ట గ్రామానికి చెందిన ఈయన 1995లో ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. పత్తికొండ, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఈయన కర్నూలు శివారు నందికొట్కూరు రోడ్డులోని చైతన్య నగర్‌లో నివాసముంటున్నాడు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోవడంతో 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. వారు ఇంటి వద్దకు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్‌ఐ వెంకటరాజుతో పాటు సహోద్యోగులు రామలింగ, చంద్రపాల్, నరసింహులు, ఎం.రాజు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, సువర్ణమ్మ తదితరులు ఇంటి వద్దకు చేరుకుని పూలమాలతో నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
మహిళ
ఆత్మహత్య
బండిఆత్మకూరు: కడమల కాలువ గ్రామానికి చెందిన తలారి మహేశ్వరి (31) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మహేశ్వరి గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధ పడుతుండేదని, ఈ క్రమంలో ఆదివారం నొప్పి తాళలేక మనస్తాపం చెంది గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త తిరుపతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరుడు మహేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


