పై చిత్రంలో కనిపిస్తున్నది వంక అనుకున్నారా.. అది రోడ్డే! వర్షానికి రోడ్డుపై ఉన్న గుంతలో నీళ్లు నిలిచి ఇలా దర్శనమిస్తోంది. మార్లమడికి వద్ద ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలను కలిపే వేదావతి(హగరి) నది వంతెన రోడ్డు ఇది. రోడ్డుపై పెద్ద గుంతలు ఉండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఎక్కడ గుంతలు ఉన్నాయో..రోడ్డు ఎక్కడ ఉందో అర్థంకాక కిందపడి గాయపడుతున్నారు. శనివారం రాత్రి కొద్దిపాటి వర్షం కురవడంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరి వంకలా కనిపిస్తోంది.
– హొళగుంద


