ఒత్తిడి నివారణకు ధ్యాన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి నివారణకు ధ్యాన శిక్షణ

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

కర్నూలు: పోలీసు అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం జిల్లా పోలీసు కార్యాలయ మైదానం, బి.క్యాంప్‌లోని కర్నూలు రేంజ్‌ డీఐజీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక మెడిటేషన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో మూడు రోజుల పాటు ధ్యాన తరగతులు నిర్వహించనున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది మొదటి రోజు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ప్రతినిధులు, ట్రైనర్లు, పోలీసు సిబ్బందికి శ్వాస ప్రక్రియలు, ఏకాగ్రత పెంపొందించే సాధనాలు, మానసిక ఒత్తిడిని తగ్గించే ధ్యాన విధానాలపై ప్రత్యేకంగా శిక్షణ అందించారు. వెంకటరమణ కాలనీలోని సీఐడీ, ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌, వెల్దుర్తి, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని పోలీసులకు కూడా హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో మెడిటేషన్‌ తరగతులు కొనసాగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement