ఖరీఫ్‌కు అంతా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు అంతా సిద్ధం

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

నంద్యాల(అర్బన్‌): జూన్‌ 2వ వారంలో ప్రారంభం కానున్న 2026 ఖరీఫ్‌కు సిద్ధంగా ఉన్నామని, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడా ది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయన్నారు. భూసారం పెంచేందుకు ఈ ఏడాది పచ్చిరొట్ట పంటల విత్తనాలైన జీలుగ 5,685 క్వింటాళ్లు, పిల్లిపెసర 1,515 క్వింటాళ్లు, జనుము 76 క్వింటాళ్లు, వేరుశనగ 2,136 క్వింటాళ్లు, మినుము 40, కొర్ర 27క్వింటాళ్లు మొత్తం 9,479 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్‌కు జిల్లాకు 1,73,115 టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా జిల్లాలో ఇప్పటికే 27,304 టన్నుల యూరియా, 11,309 టన్నుల డీఏపీ, 43,804 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువుల అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా ఇప్పటికే వ్యవసాయ యంత్ర పరికరాలకు 8.6 కోట్లు మంజూరు కాగా రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు

Advertisement
 
Advertisement
Advertisement