రేషన్‌కు ఈ కేవైసీ గండం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కు ఈ కేవైసీ గండం

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

నంద్యాల(అర్బన్‌): జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్‌కార్డుదారులకు రేషన్‌ సరఫరా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్‌ షాపుల వద్దకు వెళ్లలేక పలువురు లబ్దిదారులు రేషన్‌ తీసుకోవడం లేదు. దీంతో రేషన్‌కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలుకూడా ఆగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 1204 రేషన్‌ షాపుల్లో 5.41 లక్షల మంది రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 27,205 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదు. ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోకుంటే రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలసపోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, రేషన్‌ డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో కార్డు దారులు ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేయించకపోతే వీరందరికీ రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement