అనాప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

అనాప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ ప్రమాదకరం

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

అనాప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ ప్రమాదకరం

థైరాయిడ్‌ క్యాన్సర్‌లో నాలుగు రకాలుంటాయి. అందులో అనాప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ చాలా ప్రమాదకరం. మిగిలిన మూడు ప్రమాదం కాదు. థైరాయిడ్‌ కణితి ఉన్న అందరికీ క్యాన్సర్‌ రాదు. అందరికీ ఆపరేషన్‌ అవసరం లేదు. కణితికి సంబంధించిన పరీక్షలను బట్టి ఆపరేషన్‌ అవసరమా లేదా అన్నది నిర్ణయిస్తాం. థైరాయిడ్‌కు ఒకవైపు మాత్రమే కణితి ఉంటే ఆపరేషన్‌ తర్వాత మాత్రలు అవసరం లేదు. రెండు వైపులా కణితులు ఉంటే మాత్రం థైరాయిడ్‌ గ్రంథిని తీసివేయడమే గాక దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది.

–డాక్టర్‌ భార్గవ వ్యాస్‌ ఏఎన్‌, జనరల్‌ సర్జన్‌, కర్నూలు

Advertisement
 
Advertisement
Advertisement