26 ఏళ్ల తర్వాత.. | - | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల తర్వాత..

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

26 ఏళ్ల తర్వాత..

మహానంది: వారంతా వేర్వేరు ఉద్యోగాల్లో, కొందరు ప్రైవేటు జాబ్‌లు చేస్తూ స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఫోన్లలోనే మాట్లాడుకుంటూ ఉండే మనమందరం ఒకచోట కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. అందుకు మహానంది వేదికై ంది. 26 ఏళ్ల తర్వాత ఆదివారం అందరూ ఒక చోట చేరి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కర్నూలులోని విశ్వభారతి బీఈడీ కళాశాలలో 2000–2021లో చదువుకున్న వివిధ జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు మహానందిలో కలిశారు. ముందుగా వారందరూ శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థి, గతంలో మహానంది అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన రఘుశంకర్‌ ఆధ్వర్యంలో పర్యావరణ కేంద్రం వద్ద సమావేశమై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని విందు భోజనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement