నేర ప్రవృత్తిని మార్చుకోకపోతే పీడీ చట్టం | - | Sakshi
Sakshi News home page

నేర ప్రవృత్తిని మార్చుకోకపోతే పీడీ చట్టం

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

కర్నూలు: జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన వారు గౌరవ ప్రదమైన జీవితం గడపాలని, లేదంటే పీటీ చట్టం అమలు చేయాల్సి ఉంటుందని పోలీస్‌ అధికారులు హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీస్‌ అధికారులు రౌడీ షీటర్లకు నేర చరిత్ర ఉన్న వారికి, సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 39 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో దాదాపు 2 వేల మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం వారు ఊర్లోనే ఉన్నారా.. లేక మరో ప్రాంతంలో జీవిస్తున్నారా.. ఎంత కాలం నుంచి నేర ప్రవృత్తికి దూరంగా ఉన్నారు.. అనే విషయాలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని హితబోధ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement