మహానంది: మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్కాకుల నారాయణ అరటి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అరటిచెట్లతో పాటు చెట్లను కాపాడుకోవడానికి తెచ్చుకున్న కర్రలు, డ్రిప్ పరికరాలు కాలిబూడిదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. నారాయణ సాగు చేస్తున్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భారీ గాలుల నుంచి చెట్లను కాపాడుకునేందుకు సపోర్ట్‌గా ఏర్పాటు చేసేందుకు కర్రలు ఇటీవల కొనుగోలు చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు వెయ్యి కర్రలు, డ్రిప్ పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ. 2లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు నారాయణ తెలిపారు.


