సీఎం గారూ.. ఆడవాళ్లు పిల్లలను కనే యంత్రాలా? | - | Sakshi
Sakshi News home page

సీఎం గారూ.. ఆడవాళ్లు పిల్లలను కనే యంత్రాలా?

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం

కర్నూలు(సెంట్రల్‌): ఆడవాళ్లంటే పిల్లలను కనే యంత్రాలుగా సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, ఎవరు ఎంతమంది పిల్లలను కనాలో ఆయనే నిర్ణయించే హక్కు ఎవరిచ్చారని ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా కార్యదర్శి పి.శ్రావణిరెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్లే ముగ్గురు, నలుగురు సంతానం కలిగితే వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్‌, పౌష్టికాహారం, ఉన్నత సదుపాయాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. నేడు ప్రైవేట్‌ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లితే లక్ష బిల్లు వేస్తున్నారని, ఈ సమయంలో మూడో కాన్పుకు రూ.30 వేలు, నాలుగో కాన్పుకు రూ.40 వేలు ఇస్తేలా ఎలా సరిపోతాయన్నారు. నేటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో కుటుంబం ముగ్గురు, నలుగురు పిల్లలను సాకి పెద్ద చేసే పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం ఒక్కరినీ, ఆయన కుమారుడు లోకేష్‌ కూడా ఒక్కరే సంతానమని, అయితే ప్రజలను మాత్రం నలుగురిని కనాలని చెప్పడం వారికి భావ్యమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆశాబేగం, సోఫియా, రజియా పాల్గొన్నారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన టీ.వెంకటరామయ్య రూ.1,01,116విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, బాండ్‌ అందించి సత్కరించారు.

పోక్సో కేసు నమోదు

అవుకు(కొలిమిగుండ్ల): జూనూతల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వెంట పడుతూ వచ్చాడు. బాలిక మైనర్‌ అని తెలిసి కూడా పదే పదే ప్రేమించమని వెంటపడుతుండేవాడు. తనను ప్రేమించక పోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

భక్తులపై తేనెటీగల దాడి

పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె సమీపంలో కొండపై ఉన్న శివాలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఆలయానికి వచ్చిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తేనెటీగల దాడి లో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

నందికొట్కూరు రూరల్‌: దామగట్ల గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడి సమీపంలోని కుంట వద్ద కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ మణికంఠ తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.10, 630 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement