● తగ్గిన విక్రయాలు
నంద్యాల(న్యూటౌన్): పండ్ల ధరలు అమాంతం పెరిగిపోయి. పేద, మధ్యతరగతి ప్రజలు కొనలేని, తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో సామాన్యుడికి అందుబాటులో పండ్ల ధరలు ఉండేవి. దానిమ్మ, బత్తాయి, నల్ల కిస్మిస్ వంటి పండ్లను అధికంగా కొనుగోలుచేసేవారు. ఇప్పుడు ఈ పండ్ల కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గముఖం పట్టాయి. వేసవికాలం కావడంతో పాటు పండ్ల దిగుమతులు తగ్గడం కారణంగానే ఈ ధరలు పెరుగుదల అని వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన అరటి ధర
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడంతో అరటిపండ్ల ధరలు పెరిగాయి. గతంలో గెల ధర రూ.300 ఉండగా, ఇప్పుడు రూ.500 పలుకుతోంది. లోకల్‌గా లభించే అరటిపండ్లకు కూడా ధర పెరిగింది. వీటిని వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.
జ్యూస్‌ల రేట్లకు రెక్కలు
పండ్ల ధరలు పెరగడంతో జ్యూస్ షాపుల వ్యాపారులు జ్యూస్లు ధరలు పెంచేశారు. ద్రాక్ష, బత్తాయి, కమలా, సపోట, పైనాపిల్ వంటి జ్యూస్‌ల ధరలు గతంలో గ్లాసు రూ.25 ఉండేది. ఇప్పుడు రూ.30కు పెంచారు. ఇందులో రకరకాల ఐస్ క్రీమ్‌ల వినియోగం ఆధారంగా ధరలు రూ.60లకు పైబడి పలుకుతున్నాయి.
గతంలో ఇతర జిల్లాల నుంచి నేరుగా పండ్ల ట్రేలు వచ్చేవి. ఇప్పుడు అలా రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ట్రేలు తీసుకురావాల్సి వస్తోంది. వీటి రవాణా చార్జీలు పెరిగాయి. నాణ్యత పెద్దగా ఉండడం లేదు. ధరలు గతంలో కంటే పెరిగాయి. పండ్ల ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. –పెద్దయ్య, పండ్ల వ్యాపారి, నంద్యాల
పండ్ల ధరలు (కేజీ ప్రకారం రూ..)
పండు పేరు ధర
దానిమ్మ 300
కమలాలు 170
నల్ల కిస్మిస్ 300
వైట్ కిస్మిస్ 200
యాపిల్ 300
గతంలో కిలో దానిమ్మ రూ.150,
కమలాలు రూ.40కు వచ్చేవి.


