కుళాయి నుంచి బురద నీరు | - | Sakshi
Sakshi News home page

కుళాయి నుంచి బురద నీరు

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

ప్యాపిలి: మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా అవుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగే మాట దేవుడెరుగు.. కనీసం గృహ అవసరాలకు కూడా ఉపయోగపడ టం లేదని వాపోతున్నారు. గతంలోనూ ఒకసారి ఇలాగే కుళాయిలకు బురద నీరు రాగా.. అధికారులు స్పందించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అయితే ఆదివారం మళ్లీ అదే రీతిలో మలినాలతో కూడిన నీరు సరఫరా కావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బోరు పైపులు దెబ్బతినడమే కారణం ..

ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మనోహర్‌ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీకి చెందిన బోరు పైపులు దెబ్బతిన్న కారణంగానే కుళాయిల్లో బురద నీరు వస్తోందని తెలిపారు. సమస్యను గుర్తించామని, త్వరగతిన మరమ్మతులు పూర్తి చేయించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బురద నీరు ఎవరూ వినియోగించవద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement