కోటకందుకూరులో పార్వేటోత్సవం
ఆళ్లగడ్డ: పార్వేట మహోత్సవాల్లో భాగంగా గ్రామ గ్రా మానా విశేష పూజలందుకూంటూ తిరుగుతున్న అహోబిలేశుడి ఉత్సవ పల్లకి ఆదివారం కోటకందుకూరు గ్రామంలో కొలువుదీరింది. తెలుపులపై కొలువైన ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వాములకు గ్రామస్తులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవపల్లకీని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులకు అర్చకులు సంతానం స్వామి తీర్థప్రసాదాలు అందజేసి ఆశ్వీరచనాలు అందజేశారు. స్వామి రాకతో గ్రామంలో తిరుణాల వాతవరణం నెలకొంది.
నేడు మర్రిపల్లిలో...
అహోబిలేశుడి ఉత్సవ పల్లకి సోమవారం మర్రిపల్లి చేరుకోనుంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కోటకందుకూరులో విశేష పూజలు అందుకున్న ఉత్సవపల్లకి అర్ధరాత్రి అనంతరం కోటకందుకూరు నుంచి బయలుదేరి సోమవారం మర్రిపల్లి చేరుకుటుంది.


