మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం
నందవరం: మద్యం మత్తులో ఓ టీడీపీ నాయకుడు డ్యూటీ లోని కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో బైక్‌పై వస్తూ పడిపోగా లేపబోయిన కానిస్టేబుల్‌పైనే నోరు పారేసుకున్నా డు. నీవెంత, నువ్వు తాగవా అంటూ మానవత్వం చూపిన పాపానికి బూతులు తిట్టాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, నందవరం మండలంలోని నదికై రవాడి గ్రామానికి చెందిన కురవ వీరేష్ తెలంగాణలోని రాజపురంలో పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్‌పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సరిహద్దు చెక్ పోస్టు వద్ద బైక్ నుంచి కింద పడిపోగా చెక్‌పోస్టు విధుల్లోని కానిస్టేబుల్ కె.రాజు మానవత్వంతో అతడిని లేపబోయాడు. ఇంతలోనే టీడీపీ నాయకుడు కొడకల్లారా.. నా ఇసుక ట్రాక్టర్లే ఆపుతారా అంటూ బూతులు మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వీరంగం సృష్టించాడు. ఇంతచేసినా ఇప్పటివరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


