పర్యాటకులకు తప్పిన ప్రమాదం
● రోప్ వే వద్ద విరిగిపడిన
కొండ చరియలు, చెట్లు
శ్రీశైలం: భారీ వర్షానికి శ్రీశైల క్షేత్ర పరిధిలోని పాతాళగంగ రోప్‌వే వద్ద మంగళవారం ఉదయం కొండ చరియలు విరిగి పడ్డాయి. దొర్లుకుంటూ రోప్ వే బిల్డింగ్ సమీపంలోనే పడ్డాయి. ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమా దం తప్పింది. దీంతో టూరిజం రోప్ వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 28న కురిసిన భారీ వర్షంతో పాతాళగంగ రోప్ వే నుంచి స్నాన ఘట్టాల వరకు వెళ్లే రహదారిలో కొండ చరియలు విరిగిపడి అక్కడ తాత్కాలిక దుకాణాలు ధ్వంసం అయిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ కొండ చరియలు కూలి పడటంతో పెద్ద పెద్ద బండరాళ్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. రోప్‌వే అధికారులు అప్రమత్తమై బండరాళ్లు, చెట్లను తొలగించి స్నాన ఘట్టాల రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించారు.


