శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు
● జ్వాలా తోరణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేక ఉంది. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవైల దేవస్థానం జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనుంది. ఈ మేరకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద నిర్వహించే జ్వాలాతోరణాన్ని భక్తులు అధికసంఖ్యలో వీక్షించేలా దేవస్థానం అధికారులు ఏర్పా ట్లు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను తోరణంలా ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఇది తోరణంగా వెలుగుతోంది. కాలిన నూలు ఒత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ విధంగా ధరించడం వలన ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణోత్సవంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించి జ్వాలాతోరణం చుట్టూ మూడుసార్లు స్వామిఅమ్మవార్ల పల్లకీని ప్రదక్షిణ చేయిస్తారు.
శివపార్వతులతో ముడిపడిన పురాణగాఽథ
పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదాన వులు క్షీరసాగరాన్ని మధిస్తారు. అందులో నుంచి మొదట సకల లోకాలనూ దహించివేసే కాలకూట విషం రాగా.. దానిని పరమశివుడు లోక హితం కోసం సేవించాడని గాథ. హాలహలం కంఠంలో ఉంచుకోవడంతో శివుడికంఠం నీలంగా మారింది. దీనిని చూసి భయాందోళనకు గురైన పార్వతీదేవి తన శివుడికి ఏ కీడు జరగకుండా ఆపద నుంచి బయటపడితే భర్తతో పాటు తాను చిచ్చుల తోర ణం కింద మూడుసార్లు నడిచి వస్తాను అని కోరు కుందంట. తర్వాత శివుడుకి ఎటువంటి ఆపద కలగకపోవడంతో పార్వతీదేవి శివుడితో కలిసి కార్తీ క పౌర్ణమినాడు జ్వాలాతోరణం కింద మూడుసార్లు నడిచారని, అప్పటి నుంచి జ్వాలాతోరణం ప్రారంభమైనట్లు పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది.


