మొబైల్ అప్లికేషన్‌తో డిజిటల్ జనాభా గణన
● జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్
నంద్యాల: మొబైల్ అప్లికేషన్ల ఆధారంగా డిజిటల్ జనాభా గణన చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. మంగళ వారం రామకృష్ణ పీజీ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో భాగంగా మహానంది మండలం సెన్సస్ ప్రీటెస్ట్ కార్యక్రమానికి ఎంపికైందని, ఈ ప్రీటెస్ట్‌లో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల కోసం శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధా నం సెన్సస్ ప్రీటెస్ట్ శిక్షణా కార్యక్రమం 6వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. శిక్షణలో పాల్గొ నే వారికి జనాభా గణన ప్రక్రియ, డిజిటల్ డే టా సేకరణ విధానం, ప్రజలతో సమన్వయం, ఫీల్డ్‌లో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తారన్నారు.
పెద్దాసుపత్రిలో అత్యాధునిక శస్త్ర చికిత్స
గోస్పాడు: జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక న్యూరో శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు. న్యూరో సర్జరీ విభాగం వైద్యులు రాజేష్, భరత్‌కుమార్‌తో కలసి మంగళవారం శస్త్ర చికిత్స వివరాలను ఆమె వెల్లడించారు. శిరివెళ్ల మండలం ఇసుకపల్లి గ్రామాని కి చెందిన రాజు గత నెలలో డిస్క్‌ప్రోల్యాప్స్‌తో వెన్నెముక, కాళ్లు నొప్పులతో పాటు కాళ్ల తిమ్మిర్లు నడవలేని స్థితిలో బాధపడుతూ పెద్దాసుపత్రికి వచ్చాడు. న్యూరో విభాగం డాక్టర్లు గత నెల 30వ తేదీన రాజుకు ఆపరేషన్ చేశారు. ఎండోస్కోపీ ద్వారా డిస్క్‌ప్రోల్యాప్స్(సయాటికా) శస్త్ర చికిత్స చేయడంతో త్వరగా కోలుకున్నాడు. ఇదే ఆపరేషన్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేయించుకోవాల్సి వస్తే రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ, ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటేష్, న్యూరో విభాగం, అనస్థీషియా విభాగం డాక్టర్లు క్రిష్టఫర్, బాలాజీ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వేతనాలు కొన్ని శాఖలకే..
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి నెలా 1వ తేదీనే వేత నాలు చెల్లిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో ఎంతమాత్రం నిజం లేదని ఉ ద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అక్టోబర్ నెల వేతనాలను కేవలం టీచర్లు, పోలీసులు, మెడికల్, మరో ఒకటి, రెండు శాఖల ఉద్యోగులకు మాత్ర మే ఖాతాలకు జమ అయ్యాయి. మిగిలిన శాఖల ఉద్యోగులెవరికీ 4వ తేదీ వరకు చెల్లించలేదు.
మొబైల్ అప్లికేషన్‌తో డిజిటల్ జనాభా గణన


