సివిల్ పోలీసుల సహకారం తీసుకోండి
● ఎకై ్సజ్ అధికారులకు నోడల్ అధికారి శ్రీదేవి ఆదేశం
కర్నూలు: జిల్లాలో నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సివిల్ పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ అధికారి పి.శ్రీదేవి ఆ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. స్థానిక డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లతో ఆమె నెలవారీ సమీక్ష నిర్వహించారు. నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి నవోదయం 2.0 రెండవ దశ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అమలులో భాగంగా సారా అమ్మకం, తయారీ, రవాణాదారులతో పాటు బెల్లం సరఫరాదారులపై కూడా కేసులు నమోదు చేసి బైండోవర్ చేయాలని సూచించారు. నవోదయంను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కానిస్టేబుల్‌కు పరిధిని నిర్ణయించి వారు బీట్లు సరిగా నిర్వర్తించే విధంగా చూడాలన్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి వస్తున్న సుంకం చెల్లించని మద్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు మచ్చా సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్‌తో పాటు ఉమ్మడి జిల్లాల సీఐలు పాల్గొన్నారు.


