రమణీయం.. రాయబారాది మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సా యంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న వేపచెట్టు వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఉత్సవంలో పలుకూరుకు చెందిన అమ్మ వారి భక్తులు ఒక జత దున్నపోతు, తొమ్మిది జతల పొట్టేళ్లు, మేక పోతులతో ప్రదర్శించి తేరుబండి కార్యక్రమం ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు, నందివర్గం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రమణీయం.. రాయబారాది మహోత్సవం


