నల్లగొండ టూటౌన్ : కార్యకర్తల త్యాగాలు, పూర్వ కార్యకర్తల అనుభవాలే ఏబీవీపీ సంస్థాగత బలానికి పునాది అని ఏబీవీపీ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన ఏబీవీపీ జాతీయ మహాసభలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ సంఘం ఎన్నో తరాల కార్యకర్తల కృషి, త్యాగాలు, అంకితభావం, నిరంతర పోరాటాల సమాహారమని పేర్కొన్నారు. సంస్థ నిర్మాణంలో పూర్వ కార్యకర్తల పాత్రను, వారు ఎదుర్కొన్న పరిస్థితులను, నేటి తరం కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏబీవీపీ నల్లగొండ విభాగ్ ప్రముఖ్ కత్తుల ప్రమోద్‌కుమార్, ప్రాంత సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్, విభాగ్ కన్వీనర్ మణికంఠ, రామచంద్రుడు, స్వాతి, నన్నూరి రాంరెడ్డి, అంబాల సత్తయ్య, గోనె విష్ణువర్దన్‌రావు, పొట్టిపాక నాగరాజు పాల్గొన్నారు.
ఫ ఏబీవీపీ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ


