మొబైల్‌ యాప్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రీ | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ యాప్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రీ

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

తిరుమలగిరి(సాగర్‌) : వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రత్యేక గుర్తింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఫార్మర్‌ ఐడీ కేటాయింపునకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ అగ్రిస్టాక్‌లో భాగంగా ప్రతి రైతుకు ఈ ఐడీ నంబర్‌ తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఫార్మర్‌ రిజిస్ట్రీని ఏఈవోల వద్ద, మీసేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం ఉండగా.. ఈ ప్రక్రియ వందశాతం పూర్తికాకపోవడంతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటి నుంచే నేరుగా రైతులే నమోదు చేసుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

అధికారులపై తగ్గిన పనిభారం..

ఫార్మర్‌ రిజిస్ట్రీ నిరంతర ప్రక్రియలా కొనసాగుతుండగా.. మరో వైపు విధి నిర్వహణ, డిజిటల్‌ క్రాప్‌ సర్వే లాంటి పనులు ఏఈవోలకు భారంగా మారాయి. ప్రభుత్వం గడువు విధించడం ఆ లోపు పనులు పూర్తికాకపోవడం తలనొప్పిగా మారేది. ఇప్పుడు రైతులే ఇంటి నుంచి ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకొనే అవకాశం రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోండి ఇలా..

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోని రైతులు ఆధార్‌ కార్డు, ఆధార్‌కు లింకు ఉన్న మొబైల్‌ నంబర్‌, పట్టాదారు పుస్తకంతో ఫోన్‌ ద్వారా ఇంటి నుంచే ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఫార్మర్‌ రిజిస్ట్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తెలంగాణను ఎంచుకొని న్యూ రిజిస్ట్రేషన్‌పై నొక్కి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఆ తర్వాత జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ నమోదు చేస్తే భూమి వివరాలు కనిపిస్తాయి. పేరు, చిరునామా సరిచూసుకొని సబ్మిట్‌ చేస్తే తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ వస్తుంది. దీని ఆధారంగా ఏఈవో ఆమోదిస్తే ఫోన్‌కు 11 అంకెల ఫార్మర్‌ ఐడీ వస్తుంది.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ఎందుకంటే..

పీఎం కిసాన్‌, రైతు భరోసా, పంటల బీమా, రుణాలు, ఎరువుల బుకింగ్‌కు ఫార్మర్‌ ఐడీ ఎంతో ఉపయోగపడుతుంది. పంట అమ్ముకోవడానికి, మద్దతు ధర పొందాలన్నా ఫార్మర్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఈసారి సన్నరకం వడ్లకు అందించే బోనస్‌ కూడా ఈ ఐడీ ఉంటేనే వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఫ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement