ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

నకిరేకల్‌(చిట్యాల) : గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిట్యాల మండలంలోని ఆరెగూడె, వెలిమినేడు గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలరోజులు దాటిందని, కేంద్రాలను ప్రారంభించి పది రోజులయిందని, అయినా కొనుగోళ్లను పూర్తిస్థాయిలో నేటి వరకు ప్రారంభించలేదని విమర్శించారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకునే అవకాశాన్ని రైతులకు అధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులను ఆయన ఫోన్‌లో కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కొలను వెంకటేష్‌, బొంతల రామకృష్ణారెడ్డి, బొబ్బల శివశంకర్‌రెడ్డి, ఆగు అశోక్‌, అర్రూరీ స్వామి, ఆవుల జానయ్య, గోపగోని నర్సింహ పాల్గొన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement