రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

మిర్యాలగూడ : ఉమ్మడి నల్లగొండ జిల్లా 10వ ఎలైట్‌ పురుషులు, మహిళల బాక్సింగ్‌ ఎంపిక పోటీలను మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌గాంధీ అవుట్‌డోర్‌ స్టేడియం బాక్సింగ్‌ హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆరుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ బాక్సింగ్‌ కోచ్‌ ఇ. రవీందర్‌గౌడ్‌ తెలిపారు. పురుషుల 55 నుంచి 60 కిలోల విభాగంలో నల్లగొండ పట్టణానికి చెందిన ఎ. తేజ, 65 నుంచి 70 కిలోల విభాగంలో మిర్యాలగూడకు చెందిన ఎం. ఫణి, 70 నుంచి 75 కిలోల విభాగంలో నల్లగొండకు చెందిన డి. సాయినాథ్‌, 85 నుంచి 90 కిలోల విభాగంలో దామరచర్ల మండలం కెతావత్‌ తండాకు చెందిన అజయ్‌ ఎంపిక కాగా.. మహిళల 45 నుంచి 48 కిలోల విభాగంలో నాగార్జునసాగర్‌ కుంకుడుచెట్టుతండాకు చెందిన సాయిప్రసన్న, 65 నుంచి 70 కిలోల విభాగంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన అంజలి ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని గోల్కొండలో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని కోచ్‌ రవీందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement