బాలల పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

బాలల పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

నల్లగొండ(కనగల్‌): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు జాతీయస్థాయిలో నిర్వహించిన బాలల పోటీల్లో కనగల్‌ మండలం చిన్నమాదారం ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని పామోజు వైష్ణవి సత్తాచాటింది. వైష్ణవి రాసిన ‘యాత్ర’ అనే రచనకు 3వ బహుమతి లభించిందని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య గురువారం తెలిపారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 148 పాఠశాలల నుంచి 1,450 మంది విద్యార్థులు వివిధ ప్రక్రియల్లో తమ రచనలను పంపించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో శాలువా, మెమొంటోతో పాటు నగదు పురస్కారం అందజేయనున్నారు. వైష్ణవిని ప్రధానోపాధ్యాయురాలు వల్లపట్ల పద్మ, గైడ్‌ టీచర్‌ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

వెలుగుపల్లి విద్యార్థి ప్రతిభ

తుంగతుర్తి : అదేవిధంగా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి రెడ్డిమల్ల యశ్వంత్‌ రాసిన ‘రైతుల కష్టాలు’ కథ ఉత్తమ కథగా ఎంపికై నట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు చైర్మన్‌ ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య తెలిపారు. యశ్వంత్‌తో పాటు అతడికి గైడ్‌ టీచర్‌గా వ్యవహరించిన తెలుగు ఉపాధ్యాయురాలు శీల అవిలేనును గురువారం ప్రధానోపాధ్యాయుడు గొడుగు అబ్బ య్య, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement