యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామిని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ రమేష్ చంద్ మాల్వియా గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభూవులను జడ్జి దర్శించుకున్న అనంతరం వేద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
వైభవంగా మణవాళ మహా
మునుల తిరునక్షత్ర ఉత్సవాలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం మణవాళ మహామునుల తిరునక్షత్ర ఉత్సవాలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మణవాళ మహామునుల సేవను, పారాయణం చేస్తూ ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, మణవాళ మహామునుల తిరునక్షత్ర ఉత్సవాల విశిష్టతను భక్తులకు తెలియజేశారు. మహామునులు సర్పావతారంగా అవతరించి, రామానుజుల తర్వాత వారి అంశగా వచ్చారని, ఆచార్యుల అనుగ్రహామును భక్తులు పొందాలని తెలిపారు. ఈ పూజల్లో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


