నిరుపయోగం.. బొత్తలపాలెం | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగం.. బొత్తలపాలెం

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

ఈసారి సాగుకు నోచుకోలేదు..

మిర్యాలగూడ : మూసీనదిపై రూ.9 కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో ఏర్పాటు చేసిన బొత్తలపాలెం ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. నిర్మించిన నాలుగేళ్లకే పర్యవేక్షణ లోపంతో ఉపయోగం లేకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దామరచర్ల మండలం వాచ్యాతండా, బెట్టెతండా, బొల్లిగుట్టతండా, జైత్రాంతండాకు చెందిన 668 మంది గిరిజన రైతులకు చెందిన 600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 240 హెచ్‌పీ సామర్థ్యమున్న మూడు మోటార్లతో 2022లో ఈ లిఫ్టును ప్రారంభించారు. వీటికి 500 కేవీఏ సామర్థ్యమున్న రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించారు. నిత్యం 23 క్యూసెక్కుల నీటిని పైపులైన్‌ ద్వారా తరలించే ఈ లిఫ్టు.. మూడేళ్ల పాటు సక్రమంగా పనిచేసినా గతేడాది నుంచి మొరాయిస్తోంది. పలుమార్లు పైపులైన్లు, మోటార్లు దెబ్బతిన్నా.. రైతులే సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుని లిఫ్టును నడిపించుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. ఆయిల్‌, కాపర్‌ చోరీ

మూడు నెలల క్రితం వానాకాలం సీజన్‌ ఆరంభంలో లిఫ్టును ప్రారంభించేందుకు రైతులు అక్కడికి వెళ్లగా.. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై కనిపించాయి. వాటిలోని కాపర్‌ వైరు, ఆయిల్‌ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. రైతులు, ట్రాన్స్‌కో అధికారుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మూసీనదిలో నీరు ప్రవహిస్తున్నా మోటార్లు నడిపించలేని దుస్థితి. ట్రాన్స్‌ఫార్మర్లను బాగు చేయాలంటే సుమారు రూ.15 లక్షలు ఖర్చవుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో లిఫ్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దొంగలను సైతం పోలీసులు పట్టుకోలేకపోయారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, నిధులు మంజూరు చేసి యాసంగి సీజన్‌కై నా లిఫ్టును అందుబాటులోకి తేవాలని వేడుకుంటున్నారు.

ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 600 ఎకరాలు సాగు చేసేవాళ్లం. నేను సైతం 10 ఎకరాలు సాగు చేస్తున్నా. రెండు ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌, కాపర్‌ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. మోటార్లు పనిచేయక నా పది ఎకరాలు బీడుగా మారింది. ప్రభుత్వం స్పందించి ట్రాన్స్‌ఫార్మర్లను రిపేర్‌ చేయించి ఆదుకోవాలి.

– లావూరి సైదా, రైతు, బెట్టెతండా

ఫ 2022లో రూ.9 కోట్ల నిధులతో ఎత్తిపోతల పథకం నిర్మాణం

ఫ నాలుగేళ్లకే పర్యవేక్షణ కరువు

ఫ ఏడాదిగా సాగునీటి సరఫరా బంద్‌

ఫ బీడువారిన 600 ఎకరాల

గిరిజన రైతుల భూములు

ఫ యాసంగికై నా బాగుచేయాలని రైతుల వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement