నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)–1, 2 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో విద్యా శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. మూ ల్యాంకనంలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనం పెంచాలని ఎక్స్‌టర్నల్ మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఇకనుంచి ఉపాధ్యాయులు తమ సొంత పాఠశాలల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే అవకాశం ఉండదు. ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష పేపర్లను దిద్దనున్నారు.
మండల స్థాయిలోనే..
పరీక్షలు మాత్రం గతంలో మాదిరిగానే సొంత పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. పరీక్ష పూర్తయిన రోజే ప్రధానోపాధ్యాయులు జవాబు పత్రాలను సీల్‌చేసి మండల వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ) భవనాలకు అందజేయా లి. అనంతరం ఆయా జవాబు పత్రాలను మండల స్థాయిలో ఇతర పాఠ శాలలకు చెందిన ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేపడతారు. ఈ మూల్యాంకన ప్రక్రియను 3 నుంచి 5 రోజుల్లోపు పూర్తిచేసి మార్కులను పాఠశాల ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రాథమిక స్థాయి జవాబు పత్రాలకు ఒక్కోదానికి రూ.2, హైస్కూల్ స్థాయి జవాబు పత్రాలకు ఒక్కోదానికి రూ.3 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు. మూల్యాంకన క్యాంపు నిర్వహణకు మండలానికి రూ.10 వేల చొప్పున కేటాయిస్తారు.
ఫ ఎస్‌ఏ –1, 2 పేపర్లు దిద్దేందుకు కొత్తవిధానం తెచ్చిన విద్యాశాఖ
ఫ ఇకనుంచి ఒక స్కూల్ పేపర్లు ఇతర స్కూళ్లలో మూల్యాంకనం


