నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌పీఆర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సెంటర్ ఇన్‌చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు సూపరింటెండెంట్ రమేష్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్‌చార్జి, ప్రొఫెసర్ ఉపేందర్ ఉన్నారు.
ఫ ఒకేఒక్కరు గైర్హాజరు..
179 మంది హాజరు
ఫ పరీక్ష కేంద్రాన్ని తనిఖీకి చేసిన కలెక్టర్


