మిర్యాలగూడ : విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దెబ్బతిని రైతాంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఎంసీపీఐయూ పొలిట్‌బ్యూరో సభ్యుడు వల్లెపు ఉపేందర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకోని దేశ వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. వస్కుల సైదమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మోర్తాల చందర్‌రావు, నార్ల చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, వనం సుధాకర్, కుంభం సుకన్య, గోనె కుమారస్వామి, రమేష్, సాంబయ్య, హంసారెడ్డి, బాబు, అరుణ్‌కుమార్, తిరుపతి, వెంకన్న, రవి, నర్సయ్య, రాగసుధ, అనిల్‌కుమార్, గడ్డం, మురళి, దానయ్య, వెంకటేష్, కాశి, సాగర్, రవీందర్, సావిత్రి, సంధ్య, రాజేష్‌నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో
సభ్యుడు ఉపేందర్‌రెడ్డి


