తిప్పర్తి : నీటిని పొదుపు చేసి భావితరాలకు భవిష్యత్తునిద్దామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. జలసంచాయి–జన్‌భాగీదారి కార్యక్రమంలో భాగంగా గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని బాలుర, బాలికలు, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు మనగడ ఉంటుందన్నారు. మొక్కల పెంపకంతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కళాజాత బృందంచే పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం రజితసుధీర్, ఉపసర్పంచ్ దేవకమ్మ, ఎంఈఓ నర్సింహనాయక్, వేముల పుష్ప, ఏపీఓ రాంమోహ్మన్, కార్యదర్శి షఫి పాల్గొన్నారు.
ఆంగ్ల భాషపై
భయాన్ని పోగొట్టాలి
నల్లగొండ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాషపై ఉన్న భయాన్ని పోగొట్టేలా అర్థమయ్యే రీతిలో బోధించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని డైట్ కాలేజిలో గురువారం ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహించిన సమగ్ర వృత్యంతర శిక్షణను డీఈఓ సుశీందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ నేర్చుకున్న అంశాలను తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియలలో సమర్థంగా అమలుపరచాలన్నారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ నరసింహ, క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసగౌడ్, సెంటర్ ఇన్‌చార్జి రఘుపాల్‌రెడ్డి, అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమా శంకర్, సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
కట్టంగూర్ : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర పరిశీలన బృందం ప్రతినిధి డాక్టర్ శ్యామ్ జార్జ్ అన్నారు. గురువారం కట్టంగూర్‌లోని పీహె చ్‌సీ డీఎంహెచ్‌ఓ.కె రాహుల్, అదనపు జిల్లా వైద్యాధికారి పి.శంకర్, రాష్ట్ర పరిశీలన బృందం సభ్యులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి జమున, సూపర్‌వైజర్ అలివేలుమంగ, ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాస్, సరిత, ప్రమీల, విజయలక్ష్మి పాల్గొన్నారు.
12న ‘యంగ్ ఇండియా’ ప్రవేశపరీక్ష
సూర్యాపేటటౌన్ : యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ గురువారం తెలిపా రు. చింతలపాలెం, గరిడేపల్లి, పెన్‌పహాడ్ కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు చింతలపాలెం కేజీబీవీ 86398 42487, గరిడేపల్లి కేజీబీవీ 99513 19952, పెన్‌పహాడ్ కేజీబీవీ 99082 22434 నంబర్లను సంప్రదించాలని కోరారు.


