నేడే చేనేత ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడే చేనేత ఎన్నికలు

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

భూదాన్‌పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవమైన సంఘాలు పోను మిగిలిన 28 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 సంఘాలకు 539 మంది, నల్లగొండ జిల్లాలోని 9 సంఘాలకు 175 మంది, సూర్యాపేట జిల్లాలో 1 సంఘానికి 11 మంది బరిలో ఉన్నారు. యాదాద్రి జిల్లాలో ఎన్నికలు జరిగే సంఘాల్లో మొత్తం 5818 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 2,851 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 230 మంది ఓటర్లు మొత్తం 8,899 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లకు సంఘం గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు.

ఎన్నికలు జరిగే సంఘాలు ఇవే..

భూదాన్‌పోచంపల్లి , భువనగిరి, బండసోమారం, ఆత్మకూర్‌ (ఎం) మండలం రహీంఖాన్‌పేట మార్కండేయ సొసైటీ, యాదగిరిగుట్ట ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ సిల్క్‌ సొసైటీ, వలిగొండ మండలం వెల్వర్తి సంఘం, చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, నారాయణపురం, పుట్టపాక శ్రీభావనారుషి సొసైటీ, పుట్టపాక సిల్క్‌సొసైటీ, రామన్నపేట మండలం భోగారం, సిరిపురం, జనంపల్లి, వెంకటరమణ సొసైటీ, వెల్లంకి, మోత్కూర్‌, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి, నార్కట్‌పల్లి మండలం మాండ్ర, గట్టుప్పల్‌, గట్టుప్పల్‌ ధనలక్ష్మి సొసైటీ, మునుగోడు, పలివెల, పలివెల బాలాజీ సిల్క్‌ సొసైటీ , చండూర్‌, మర్రిగూడ మండలం వట్టిపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి.

రహస్య పద్ధతిలో ఓటింగ్‌

ప్రతి చేనేత సంఘంలోని 7 జనరల్‌, 2 మహిళా రిజర్వు మొత్తం 9 డైరెక్టర్‌ స్థానాలకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జనరల్‌ అభ్యర్థులకు తెలుపు రంగు, మహిళా రిజర్వు అభ్యర్థులకై తే పింక్‌ రంగు బ్యాలెట్‌ పత్రం ఇస్తారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కోరం ఉంటే పోలింగ్‌ జరిగిన 3 రోజుల లోపు ఎప్పుడైనా ఎన్నికై న 9 మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, కోశాధికారిని చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు.

ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు

జనరల్‌ స్థానాలలో పోటీ చేస్తున్న డైరెక్టర్‌ల అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రంలో గరిష్టంగా 7, లేదా అంతకంటే తక్కువ మందికి ఓటు వేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఏడుగురి ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వేసినా అది రద్దవుతుంది. అలాగే రెండు మహిళా స్థానాల బ్యాలెట్‌లో రెండు, లేదా ఒకరికి ఓటు వేసినా చెల్లుతుంది. కానీ రెండుకంటే ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు.

ఫ ఉమ్మడి జిల్లాలో

28 సంఘాలకు ఎన్నికలు

ఫ ఉదయం 7నుంచి 3గంటల

వరకు పోలింగ్‌

ఫ పోలింగ్‌ ముగిసిన తర్వాత

ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement