ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు 13 వేలకు పెంచాలి
నల్లగొండ : రైతులు ఎలాంటి పంటలు వేసుకో వాలో సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉందని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులందరికీ తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు, చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
గ్రామ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి
గ్రామ అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి దోహదపడే పనులు చేపట్టే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. అనంతరం డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం, గ్రామ సమృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డీపీఓ శంకర్‌నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదును 13 వేల వరకు పెంచాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో ఎంఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం పోషణ్ పథకం, మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, ఫుడ్ సేఫ్టీ తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. పలు సూచనలు చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.


