నార్కట్‌పల్లి : చెర్వుగట్టు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యుల చేత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా వారాల రమేష్‌ను పాలకమండలి సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్వుగట్టు ఆయల ప్రాముఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డికి.. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి వివరించిన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని వివరించారు. ఆలయానికి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోందని, నూతనంగా పదవులు పొందిన పాలకమండల సభ్యులు ఆలయ ప్రాముఖ్యత, చరిత్రను అందరికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ వారాల రమేష్, పాలక మండలి సభ్యులు నల్ల అనిత, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇడుకుల్ల సంపత్‌కుమార్, మర్రి లింగస్వామి, కమ్మలపల్లి మల్లేషం, కొమ్ము శ్రీను, మధుల నర్సింహ, రంగ శ్రవణ్‌కుమార్, పాల మహేష్, వీరెల్లి రఘునాథ్, గద్దగూటి యాదయ్య, గౌరిదేవి లక్ష్మయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, ఆలయ ఈఓ మోహన్, సర్పంచ్‌లు నేతగాని కృష్ణ, ఏల్లెందుల లింగస్వామి, జేరిపోతుల భారత్, వెంకట్‌రెడ్డి, కొంపెల్లి సైదులు, పున్నపురాజు యాదగిరి, రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, నల్ల వెంకన్న, సట్టు సత్తయ్య, సిద్దగోని స్వామి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, సామ నరేందర్‌రెడ్డి, గడ్డం పశుపతి, గోలి సాగర్‌రెడ్డి, మట్టిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం


