‘హ్యామ్‌’లో రోడ్లు అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

‘హ్యామ్‌’లో రోడ్లు అభివృద్ధి

May 12 2026 6:00 AM | Updated on May 12 2026 6:00 AM

మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్‌లోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(హ్యామ్‌) రహదారుల ప్రాజెక్టు మొదటి దశలో మిర్యాలగూడ ఆర్‌ అండ్‌ బీ డివిజన్‌లో 12 రహదారులను ఎంపిక చేశారు. రూ.616 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో కాంట్రాక్టర్‌ 60 శాతం, ప్రభుత్వం 40 శాతం నిధులు భరించి నిర్మిస్తారు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత వాయిదాల్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తుంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని అప్రూవల్‌ వచ్చిన వెంటనే పనులను ప్రారంభించేలా చూస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌ తెలిపారు.

ఎంపిక చేసినవి రోడ్లు ఇవే..

● ముకుందాపురం తుమ్మడం మీదుగా అడవిదేవులపల్లికి వెళ్లే రహదారి 21 కిలోమీటర్లు.

● నాగార్జునసాగర్‌ పీడబ్ల్యూడీ రహదారి నుంచి రాజవరం మీదుగా అల్వాల ఎక్స్‌ రోడ్డు వరకు 14.22 కిలోమీటర్లు.

● పడమటపల్లి పీడబ్ల్యూడీ రహదారి నుంచి శ్రీశైలం రహదారి వరకు 18.43 కిలోమీటర్లు.

● మాడుగుల పీడబ్ల్యూడీ రహదారి నుంచి సాగర్‌ పీడబ్ల్యూడీ రహదారి వరకు 9.30 కిలోమీటర్లు.

● డిండి– దేవరకొండ రహదారి నుంచి బాపనకుంట మీదుగా గోనబోయినపల్లి వరకు 16 కిలోమీటర్లు.

● కొత్తపల్లి అజ్మాపూర్‌ రహదారి (ధర్మాతండా మీదుగా) 7 కిలోమీటర్లు.

● బొత్తలపాలెం రాగడప రహదారి (కల్లేపల్లి, తిమ్మాపురం, శాంతినగర్‌, నర్సాపూర్‌, రాజాగట్టు, పుట్టలగడ్డ మీదుగా) 25.65 కి.మీ.

● డిండి – దేవరకొండ రహదారి 34 కిలోమీటర్లు.

● డిండి – దేవరకొండ రహదారి నుంచి కంబాలపల్లి 30.90కిలోమీటర్లు.

● మహబూబ్‌నగర్‌ నల్లగొండ రహదారి (మల్లేపల్లి నుంచి ధర్వేశిపురం వరకు) 8 కిలోమీటర్లు.

● మిర్యాలగూడ – తడకమళ్ల రహదారి 15.43 కి.

● ముకుందాపురం, తుమ్మడం, అడవిదేవులపల్లి (నారమ్మగూడెం మీదుగా) 8.46కిలోమీటర్లు.

ఫ మిర్యాలగూడ డివిజన్‌లో12 రహదారుల గుర్తింపు

ఫ రూ.616 కోట్లతో టెండర్లు పూర్తి

Advertisement
 
Advertisement
Advertisement