నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి

May 12 2026 6:00 AM | Updated on May 12 2026 6:00 AM

నల్లగొండ : నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జల సంచాయ్‌ – జన్‌ భాగిదారి’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సోమవారం ఆయన కలెక్టరేట్‌లో మేయర్‌ బుర్రి చైతన్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జల సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలలో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతుందన్నారు. తెలంగాణ సాంస్క్రతిక సారధి కళాకారుల ద్వారా నీటి సంరక్షణ, నీటి పొదుపు, నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరులను సంరక్షించుకోవాలని, సూచించారు. మేయర్‌ బుర్రి చైతన్య మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇల్లు నిర్మించుకునే వారిరు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ పున్న జ్ఞానేశ్వరి, కలెక్టరేట్‌ ఏఓ మోతిలాల్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement