ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

May 12 2026 6:00 AM | Updated on May 12 2026 6:00 AM

నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో 86 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు సంబంధించినవి 40 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి మంజూరు చేసే ఇళ్లకు గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన తర్వాత లాగిన్‌కు పంపించాలని చెప్పారు. జనగణనలో భాగంగా సోమవారం నుండి నిర్వహించనున్న ఇళ్ల లెక్కింపును, విద్యా వారోత్సవాలను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. జూన్‌ 2 నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకకు అన్ని శాఖలు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కింద చేపట్టిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సమర్పించాలన్నారు. జూన్‌ 1 నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సిబ్బందికి శిక్షణ సిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement