దేవరకొండ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు నమోదై మూడు రోజులవుతున్నా నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో వల్లపురెడ్డి, టీవీఎన్ రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


