తిప్పర్తి : మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆదివారం మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుకింగ్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకుండానే డెలివరీ అయినట్లు మెసెజ్ వస్తోందని ఆరోపించారు. సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్న గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకొని బుకింగ్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


