దళితుల ఆత్మీయ బంధువు.. సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

దళితుల ఆత్మీయ బంధువు.. సీఎం రేవంత్‌రెడ్డి

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

నల్లగొండ : దళితుల ఆత్మీయ బందువు సీఎం రేవంత్‌రెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ అన్నారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్‌ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కేబినెట్‌లో ఐదు మంత్రి పదవులు దళితులకు దక్కాయన్నారు. ఎస్సీ వర్గీకరణతో అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. దళితులను వంచించిన కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ను ప్రజలు జన్మలో నమ్మరన్నారు. కాంగ్రెస్‌ సంస్థాగత ఇన్‌చార్జి మందుల సూర్యకిరణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు అండగా నిలిచేది దళితులే అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ తో సాధ్యమన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, బీసీ సెల్‌ చైర్మన్‌ జిల్లా పల్లి పరమేష్‌,, కుర్పటి గణేష్‌, వేముల గోపి, పెరిక అంజయ్య, పుల్లెంల సందీప్‌, చింతపల్లి బాలకృష్ణ, సంజయ్‌, వినోద్‌, చిరుమర్తి ఉపేందర్‌, పెరిక హరిప్రసాద్‌, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement