3,99,593 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నాం | - | Sakshi
Sakshi News home page

3,99,593 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నాం

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ : యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.954.63 కోట్ల విలువ చేసే 3,99,593 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,59,596 మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని కొనుగోలు చేసిన ధాన్యంలో 3,97,616 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, రూ.644 కోట్ల విలువచేసే 2,69,730 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్‌ ఎంట్రీ చేశామని వెల్లడించారు. ధాన్యం అమ్మిన 30,167 మంది రైతులకు రూ.558.94 కోట్లు చెల్లించామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రోజూ క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు.

ఎంజీయూలో నేటి నుంచి విద్యా వారోత్సవాలు

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో సోమవారం నుంచి తెలంగాణ విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మెగా టీచర్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌, రెండవ రోజు జాతీయ విద్యా ప్రణాళిక – 2020 అమలుపై చర్చ, మూడవరోజు డిగ్రీ టీచర్లకు సిలబస్‌ రివ్యూ, కొత్త డిగ్రీ కోర్సులపై ఓరియంటేషన్‌, 4వ రోజు బీఈడీ టీచర్లకు సిలబస్‌ రివ్యూ, మూల్యాంకనంపై ఓరియంటేషన్‌, 5వ రోజు ఇంజనీరింగ్‌ టీచర్లకు కత్రిమ మేధ వినియోగం శిక్షణ, 6వ రోజు నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు కత్రిమ మేధ వినియోగంపై ఓరియంటేషన్‌, 7వ రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మెరుగైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలి

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాలయాల్లో కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన డీటీఎఫ్‌ ఐదవ జిల్లా వార్షిక కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడం సరికాదన్నారు. మొత్తంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చెర్ల వేణు, బీవీ రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ.పున్నయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement