‘కేన్స్‌’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

‘కేన్స్‌’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

భూదాన్‌పోచంపల్లి : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఈ నెల 17 నుంచి 21 వరకు 79వ కేన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ షోలో తెలంగాణ ఇక్కత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌ పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలను ధరించి రెడ్‌ కార్పెట్‌ వాక్‌ చేయనుంది. అదేవిధంగా ప్రీ ఈవెంట్‌ పార్టిసిపేషన్‌, ర్యాంప్‌ అండ్‌ స్టైలింగ్‌ చేయనున్నారు. హౌజ్‌ ఆఫ్‌ వెండోమ్‌ ప్యారిస్‌, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన రష్మీ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. ఫ్యాషన్‌ షోకు అవసరమైన ఇక్కత్‌ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్‌ కంపెనీ సీఈఓ తడక రమేశ్‌ ఆదివారం రష్మీ ఠాకూర్‌కు పంపించారు. ఈ సందర్భంగా తడక రమేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా తమకు ఇక్కత్‌ వస్త్రాలను అందించేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆదివారం రూ.లక్ష విలువైన ఎంపిక చేసిన ఇక్కత్‌ వస్త్రాలను అందజేశామని పేర్కొన్నారు. అంతేకాక తనకు కూడా ర్యాంప్‌ వాక్‌లో చేనేత కళాకారుడిగా పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు రష్మీఠాకూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఫ్యాషన్‌ షోకు ఎంపిక చేసిన పోచంపల్లి

ఇక్కత్‌ వస్త్రాలు ఇవే..

ఫ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ధరించనున్న

బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌

Advertisement
 
Advertisement
Advertisement