రామగిరి(నల్లగొండ), తిప్పర్తి : మేలు జాతి పశు సంతతితో లాభాలు పొందవచ్చని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ జివి.రమేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలంలోని జికె అన్నారం, తిప్పర్తి మండలంలోని జొన్నగడ్డలగూడంలో పశు గర్భకోశ వ్యాధి చికిత్సలు, మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. పశువుల్లో వచ్చే వ్యాదులను రైతులు ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. పశువైద్యాధికారులు కోట్ల సందీప్‌రెడ్డి, డా. పల్లవి, యశ్వంత్, సర్పంచ్ నామిరెడ్డి అనురాద,ఉపసర్పంచ్ డేవిడ్, సాయిచరణ్, శ్రీహరి, రసూల్, హతిక్, శివ, అరుణ్, నర్సింహ పాల్గొన్నారు.


