నల్లగొండ టూటౌన్ : జనగణనలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని ఎన్జీ కాలేజి నుంచి క్లాక్‌టవర్ వరకు జనగణన నడకను మేయర్ బుర్రి చైతన్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గణన, గృహాల లెక్కింపు, జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ గణన ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకోవచ్చని, 16 భాషల్లో గణన చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. పెద్దబండ వద్ద స్వీయ గణనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన మాట్లాడారు. స్వీయ గణన సందర్భంగా అద్దె ఇంట్లో ఉన్న అక్కడి నుంచే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనగణనలో సరైన సమాచారం ఇవ్వాలని, ఇది భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంట్లో ఉన్న అందరి వివరాలను తెలియజేయాలని, కుటుంబానికి ఒక ఎన్యుమరేషన్ ఐడీ వస్తుందని, దీని ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణన జాప్యం లేకుండా త్వరత్వరగా చేసుకునేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సీపీఓ శ్రీనివాస్‌నాయక్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల అధికారి అక్బర్ అలీ, తహసీల్దార్ పరశురాం, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫ 10వ తేదీనే ఆఖరు
ఫ నల్లగొండలోన జనగణన నడకను
ప్రారంభించిన కలెక్టర్ చంద్రశేఖర్


