నల్లగొండ : మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానికి పోస్టు కార్డులు పంపనున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వై.సుజాత, జె.లలిత, బి.స్వరూపారెడ్డి, వెంకటమ్మ, డి.సుజాత, డి.సునీత, పి.సుజాత, ఎస్.ఐలమ్మ, కె.సమ్మక్క, ఎస్.బాగ్యమ్మ, కె.ప్రియాంక, డి.లక్ష్మమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.


