రామగిరి (నల్లగొండ) : తెలంగాణ కవి డాక్టర్ బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివని ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో బోయ జంగయ్య వర్ధంతి సభను నిర్వహించారు. జంగయ్య చిత్రపటానికి జిల్లా కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బోయ జంగయ్య రచయితగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. జంగయ్య సాహితీ సేవలకు గుర్తింపుగా నల్లగొండలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు. సాహితీవేత్త, సినీ విమర్శకుడు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య మాట్లాడుతూ బోయ జంగయ్య మానవీయ కోణంలో చేసిన రచనలు అందరికీ స్ఫూర్తిని కలిగించాయన్నారు. విశిష్ట అతిథి పున్న అంజయ్య మాట్లాడుతూ బోయ జంగయ్య తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. కార్యక్రమంలో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జీవకవి మునాసు వెంకట్, డాక్టర్ పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, డాక్టర్ మహమ్మద్ హసేన, డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, బండారు శంకర్, దున్న యాదగిరి, దర్శనం అంజయ్య, డాక్టర్ చింతోజు మల్లికార్జునచారి, ఎలికట్టె శంకర్‌రావు, దాసరి శ్రీరాములు, బూర్గు గోపికృష్ణ, తరుణోజు భీష్మాచార్య, జంగయ్య కుటుంబ సభ్యులు చేతన్, సిద్ధార్థ్, నామా వెంకటేశ్వర్లు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


