తిప్పర్తి : రైతులు సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్మాయ పంటల సాగుపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు దొడ్డురకం వరి కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్నరకాలతోపాటు కూరగాయలు, పామాయిల్ పంటలు సాగుచేసి ఆదాయం పొందాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు, ప్రజలు సోలార్ సిస్టమ్‌ను వాడుకున్నట్లయితే కరెంటు సమస్యలు తలెత్తవన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు విద్యుత్ వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలను కూడా ఎత్తులో నిర్మించుకుంటే మూగజీవాలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉంటాయన్నారు. బోరు మోటార్ల దగ్గర నాణ్యమైన తీగలు, స్టార్టర్లను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం రజితసుధీర్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, రెడ్‌కో డీఎం సంతోష్, డీఈలు రాజునాయక్, ప్రసాద్‌రావు, ఏిఈ శ్రీనివాస్, ఏఈ శివకుమార్, రైతులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్


