లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది..
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 మార్కెట్లకు గాను అన్ని మార్కెట్లు మంచి ఆదాయాన్ని గడించాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవసాయ మార్కెట్లకు కలిపి రూ.78.26 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దామరచర్ల మినహా మిగతా పది మార్కెట్లు రూ.80.20 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి.
మిర్యాలగూడకు అధికంగా..
జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నిడమనూరు, హాలియా, నల్లగొండ, నకిరేకల్, చిట్యాల, చండూర్, వెంకటేశ్వరనగర్ (మాల్) వ్యవసాయ మార్కెట్లలో అత్యధికంగా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ రూ.32 కోట్ల 53 లక్షల ఆదాయం సమకూరింది. దేవరకొండ, చండూరు మార్కెట్ కమిటీలు లక్ష్యం కంటే తక్కువగా.. ఆదాయాన్ని సాధించాయి. అత్యల్పంగా దామరచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ.76 లక్షల ఆదాయాన్ని మాత్రమే సమకూర్చుకుంది. దామరచర్ల మార్కెట్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆదాయానికి సంబంధించిన లక్ష్యం నిర్దేశించలేదు.
ఆదాయం వచ్చేది ఇలా..
మిల్లర్లు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర వ్యాపారులు, పత్తి, బత్తాయి వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసే ధాన్యం ఇతర పంటలపై వ్యవసాయ మార్కెట్లకు సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వ్యాపారులు మన జిల్లా నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లే ఉత్పత్తులపై కూడా ఆయా మార్కెట్ కమిటీలకు చెక్‌పోస్టుల వద్ద సెస్ చెల్లించడం ద్వారా ఆదాయం సమకూరుతుంది.
మార్కెట్ కమిటీల ఆదాయం ఇలా (రూ.లక్షల్లో)
మార్కెట్ లక్ష్యం ఆదాయం
మిర్యాలగూడ 3238.93 3253.08
దేవరకొండ 757,13 675.11
నల్లగొండ 720.71 779.84
నకిరేకల్ 494.10 601.12
హాలియా 476.18 540.58
నిడమనూరు 419.64 459.77
చిట్యాల 419.83 424.09
చండూరు 468.96 332.15
వీటీనగర్ 694.06 721.86
శాలిగౌరారం 136.97 156.28
దామరచర్ల – 76.09
మొత్తం 7826.51 8019.97
ఫ లక్ష్యానికి మించి సమకూర్చుకున్న మార్కెట్ కమిటీలు
ఫ 2025 – 26 సంవత్సరానికి టార్గెట్ రూ.78.26 కోట్లు
ఫ సాధించింది రూ.80.20 కోట్లు
2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నీ లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇదే ఉత్సాహంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటాం. – ఛాయాదేవి, మార్కెటింగ్ అధికారి


