నిస్వార్థ సేవతోనే ప్రజల్లో మంచి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

నిస్వార్థ సేవతోనే ప్రజల్లో మంచి గుర్తింపు

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

నకిరేకల్‌ : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే ప్రజాప్రనిధులకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌ మున్సిపల్‌ పాలవర్గం ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియడంతో మున్సి పల్‌ కార్యాలయం ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన వీడ్కోలు, సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని పదవులు అధిరోహించేలా ప్రజలకు సేవలందించాలన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి పాలకవర్గం చేసిన కృషి ఎనలేదని కొనియాడారు. ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందారని అభినందించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్‌, గాజుల సుకన్య, పన్నాల పావని శ్రీనివాస్‌రెడ్డి, యాసారపు లక్ష్మీవెంకన్న, మట్టిపల్లి కవితా వీరు, గర్శకోటి సైదులు, పోతుల సునీత రవీందర్‌, చౌగోని అఖిల లక్ష్మీనారయణ, చౌగోని రాములమ్మ సైదులు, గడ్డం స్వామి, వంటెపాక సోమలక్ష్మి, బానోతు వెంకన్న పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం

ఫ ముగిసిన నకిరేకల్‌ మున్సిపల్‌

పాలవర్గ పదవీకాలం

Advertisement
 
Advertisement
Advertisement