ఆరోగ్యమే గొప్ప సంపద | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే గొప్ప సంపద

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండలో సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్‌

నల్లగొండ టూటౌన్‌ : మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానం నుంచి ఏర్పాటు చేసిన 2కే, 5కే, 10కే రన్‌లను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్‌ను అవంతిక కన్‌స్ట్రక్షన్స్‌, ఆరోగ్య హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. జూన్‌ 7న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో జరగనున్న రన్‌లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారు ప్రసాద్‌, అదనపు ఎస్పీ రమేష్‌, ఆరోగ్య సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ రమేష్‌, డాక్టర్లు పుల్లారావు, రాఘవ సంకోజు, సునిల్‌, సతీష్‌, నిఖిల్‌, చంద్రశేఖర్‌, అనితారాణి, డీఎస్పీ శివరామిరెడ్డి, అవంతిక కన్‌స్ట్రక్షన్‌ ఎండీ ఎన్నం హేమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రన్నింగ్‌ చేస్తున్న యువతి

Advertisement
 
Advertisement
Advertisement